calender_icon.png 27 October, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేపై వస్తున్న వదంతులు నమ్మొద్దు

27-10-2025 12:44:52 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మ

మంచిర్యాల, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ అన్నారు. ఆది వారం ఎంఎల్‌ఏ ఇంటి వద్ద మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ మండలాలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఆర్టీఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్ తో కలిసి 80 మందికి రూ. 26,76, 500 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే స్వల్ప అనారోగ్య కారణంగా అందుబాటులో లేకున్నా నియోజక వర్గ ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ప్రజలకు అందేలా చూస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై అధికారులతో ఫోన్ మాట్లాడుతూ పరిష్కారానికి ఆదేశాలిస్తున్నారని, అలాంటి వ్యక్తిపై విమర్శకులు ఆరోగ్యం బాగోలేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారి మాటలు ఎవ రూ నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, హేమలత, సూరిమిల్లా వేణు, సంపత్ రెడ్డి, డేగ బాపు, కొట్టె శంకర్, ముని తదితరులు పాల్గొన్నారు.