27-10-2025 12:46:18 AM
బీఎంఎస్ ఏరియా అధ్యక్షుడు సత్తయ్య డిమాండ్
శ్రీరాంపూర్, అక్టోబర్ 26: కోలిండియా మాదిరిగా సింగరేణి వ్యాప్తంగా పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు.
ఆది వారం బిఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ పరంగా 70 శాతం ఉత్పత్తి సంస్థ టర్నోవర్, సంస్థ లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఉందని, లాభాల వాటలో భాగస్వాములను చేయాలని బిఎంఎస్ డిమాండ్ మేరకు రూ. 5500 చెల్లించారన్నారు.
దీపావళి బోనస్ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) కోల్ ఇండియా మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన
ఈ సమావేశంలో కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఐలవేణి శ్రీనివాస్, ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, బొంపల్లి రమేష్, రాజారాం కిరణ్, కటుకూరి సతీష్, జల్లా తిరుపతి, కోమ్మ బాపు, మహేందర్, బుర్ర అరుణ్ గౌడ్, బోడకుంట శ్రీధర్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.