calender_icon.png 24 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేబర్ స్కీములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు

24-09-2025 01:19:03 AM

సహాయ కార్మిక అధికారికి వినతి పత్రం అందజేత 

మంథని, సెప్టెంబర్23(విజయక్రాంతి) సీఐటీయూ ఆధ్వర్యంలో మంథని సహాయ కార్మిక అధికారి డి రవీందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ప్రమాద మరణానికి రూ. 10 లక్షలు సహజ మరణానికి రెండు లక్షలు పెంచుతూ నిర్ణయం చేసిందన్నారు.

సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలుగా చేసిన పోరాట ఫలితంగానే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని, దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని జీవో నెంబర్ 12 తీసుకువచ్చి 346 కోట్ల రూపాయలను ప్రైవేటు సంస్థలకు అక్రమంగా అప్పజెప్పడం అన్యాయమని అన్నారు.

జీవో నెంబర్ 12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికుల ప్రభుత్వమే సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే పరిష్కారం చేయాలని సిఎస్ సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దుచేసి కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికులతో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బాబు, రవి, మంథని కిష్టయ్య, నఫీజ్ తదితరులుపాల్గొన్నారు.