24-09-2025 12:40:59 AM
నకిరేకల్(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలో యూరియా కోసం మంగళవారం తెల్లవారుజాము నుచంఏ రైతులు క్యూ కట్టారు. చంటి బిడ్డలతో మహిళా రైతులు లైన్‌లో నిలబడ్డారు. అందులో ఒక తల్లి..
తన బిడ్డ పాల కోసం ఏడుస్తుండటంతో తన ముందు, వెనక ఉన్న మహిళలకు లైన్ చూడండి అక్కా.. బిడ్డకు పాలిచ్చి వస్తా అని చెప్పి, బిడ్డకు పాలిచ్చింది. అలాగే మరి కొంతమంది మహిళలు చద్దన్నం తెచ్చుకుని మధ్యాహ్నం వేళ అక్కడే తిన్నారు. ఈ చిత్రాలు విజయక్రాంతి కెమెరాకు చిక్కాయి.