25-07-2025 12:28:56 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, జూలై 24 (విజయ క్రాంతి), విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను, ప్రభుత్వ ఆసుపత్రి, హాస్టల్ భవనాన్ని, తిప్పారం వాగు పై లెవెల్ బ్రీడ్జీని అధికారులతో కలిసి పరిశీలించారు.
గత సంవత్సరం అధిక వర్షాలు కురిసినప్పుడు లో లెవల్ బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహించి రాకపోకలకు ఇబ్బంది అయినా దృశ్య ఈసారి ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వాగులో ఉన్న చెత్త చెదారం, బురదను తొలగించి వాగులో పైనుండి వచ్చే వర్షం నీరు కిందికి సాఫీగా వెళ్లేలా చూడాలని అన్నారు.
అదేవిధంగా అధికంగా వర్షాలు కురిసినప్పుడు జిల్లాలో గుర్తించిన 38 ప్రాంతాలు ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 12 ప్రాంతాలు ఉన్నాయని వాటితో పాటు బ్రిడ్జిలు, రోడ్లపై నుండి వరద నీరు ప్రవహించే ప్రాంతాలను గుర్తించి ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసి వాగులకు ఇరువై పులా బారికేడింగ్ చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటారు.
కళాశాల ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి గుంట నిర్మాణాన్ని ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
గాంధారి మండలంలో గల రెవెన్యూ, ఫారెస్ట్ వివాదంలో ఉన్న భూములను రెవెన్యూ ,ఫారెస్ట్ అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచూసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ రేణుక చౌహన్ ను ఆదేశించారు.
జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, హౌసింగ్ పిడి విజయ్ పాల్ రెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహ రెడ్డి, హౌసింగ్ ఏఈ స్వర్ణలత, వైద్యులు విజయలక్ష్మి, సంగీత్ కుమార్, ప్రసన్న, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.