calender_icon.png 22 August, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా దౌర్జన్యం

22-08-2025 01:12:49 AM

పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపణ 

మేడ్చల్, ఆగస్టు 21(విజయ క్రాంతి): మూడు చింతలపల్లి మండలం అనంతరం గ్రామంలోని 94, 97 సర్వే నెంబర్లలో తమ పేర్ల మీద పట్టాలు ఉన్నప్పటికీ మల్లేపల్లి నాగరాజు, లక్ష్మయ్య తప్పుడు పత్రాలతో భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని నారాయణపూర్ కు చెందిన మల్లేపల్లి నర్సింలు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం న్యాయం కోసం కలెక్టరేట్ కు వచ్చి విలేకరులతో మాట్లాడారు. 2024 లో మేడ్చల్ కోర్టు ఇంజక్షన్ ఆదేశాల ప్రకారం నాగరాజు, లక్ష్మయ్యలు పొలంలోకి ప్రవేశించరాదని ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికీ 2024 అక్టోబర్ 21వ తేదీన హరికృష్ణ పై దాడి చేశారని, ఈ విషయమై షామీర్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. మళ్లీ భూమిలోకి చొరబడి హద్దురాళ్ళు ఫెన్సింగ్ ధ్వంసం చేశారని తెలిపారు,

సైబరాబాద్ డిసిపి 15 రోజులు ఎవరు పొలంలోకి వెళ్లరాదని ఆదేశించినప్పటికీ నాగరాజు తన అనుచరులతో కలిసి దాదాపు 200 పైగా మామిడి, జామ, కొబ్బరి, సీతాఫల చేతులు నరికి వేసి, కరెంటు మీటరు ధ్వంసం చేశారని వారు పేర్కొన్నారు. స్థానిక పోలీసులు పట్టించుకోవడంలేదని, కోర్టు ఆదేశాలు కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.