calender_icon.png 22 November, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటికీ వెళ్లి చెక్కుల పంపిణీ

18-08-2024 12:03:44 AM

మంథని, ఆగస్టు 17 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలంలో శనివారం మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు ముత్తారం, ఓడేడు, ఖమ్మంపల్లి, పారుపల్లి, హరిపురం గ్రామాల్లో లబ్ధిదారులకు చెక్కులను మంత్రి ప్రభుత్వ పీఏ ఆకుల చంద్రశేఖర్ అందజేశారు. ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆడబిడ్డల కళ్లల్లో ఆనందం చూసేందుకు కల్యాణలక్ష్మి చెక్కులను ఇళ్లకు వెళ్లి ఇస్తున్నట్లు తెలిపారు. చెక్కులను అందకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.