18-08-2024 12:02:56 AM
బీజేపీ మండలాధ్యక్షుడు జగదీశ్వరాచారి
కరీంనగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఉత్తమ సేవలందించే వారికే ప్రజల నుంచి, ప్రభుత్వాల నుంచి గుర్తింపు లభిస్తుందని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి పేర్కొన్నారు. రామక్రిష్ణకాలనీలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు ఫరీదా, గంగు సునీత, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రాజెక్ట్ జిల్లా కో -ఆర్డినేటర్ ఆవుల సంపత్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి ప్రశంసాపత్రాలతో అభినందించారు. శనివారం గ్రామ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. ప్రజలకు మరిన్ని సేవలందించి రాష్ట్రస్థాయిలో పేరొచ్చేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎడ్ల భూంరెడ్డి, వేల్పుల ఓదయ్య, రావులకారి రాజు, కిన్నెర ముత్తిలింగం, దుర్గుంటి శేఖర్‌రెడ్డి, శాబోలు గణేష్, సిద్ధ శ్రీనివాస్, పండుగ రాజయ్య, నిమ్మకాయల కుమార్ తదితరులు పాల్గొన్నారు.