calender_icon.png 9 September, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజాసాబ్ ఫ్యాన్స్‌లో డబుల్ జోష్

08-09-2025 12:53:45 AM

ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది రాజాసాబ్’. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానా యికలుగా నటిస్తున్నారు. యోగిబాబు, సంజయ్‌దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన కంటెంట్‌తో ప్రేక్షకుల్లో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను పెరిగిపోయాయి. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తాజాగా ‘రాజాసాబ్’ డబుల్ అప్డేట్స్ అంటూ పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 1న ట్రైలర్ రాబోతుండగా, డార్లింగ్ బర్త్ డే కానుకగా అదే నెల 23న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.