24-12-2025 12:00:00 AM
కుమ్రం భీం అసిఫాబాద్, డిసెంబర్ 23(విజయ క్రాంతి): భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖత్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి రీసెర్చ్ ఆర్టికల్ రైటింగ్ పోటీలో ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగానికి చెందిన రీసెర్చ్ అసోసియేట్ డా.కత్తెరసాల శ్రీనివాస్ జాతీయ స్థాయి రీసెర్చ్ అవార్డును పొందారు.
మాజీ ప్రధాని వాజపేయ్ శతజయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతు ల మీదుగా ఆయనకు జాతీయ అవార్డు, రూ. 10,000 నగదు, ప్రశంసా పత్రం అందజేశా రు. వికసిత్ భారత్ 2047 అటల్ విజన్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంశంపై రాసిన పరిశోధనా వ్యాసానికి ఈ అవార్డు లభించింది. ఆసిఫాబాద్ జిల్లా తలోడి గ్రామానికి చెందిన డా.శ్రీనివాస్ ఉస్మానియా వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఓయూ సోషియాలజీ విభాగంలో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు.