24-12-2025 12:00:00 AM
వాంకిడి, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఈ నెల 28, 29 తేదీల్లో జనగామలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాల పోస్టర్లను మంగళవారం స్థానిక పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ వాంకిడి పాఠశాల ఆవరణలో మండల అధ్యక్షులు బండే హరీష్, ప్రధాన కార్యదర్శి నాగ రాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న ఉదయం ఉపాధ్యాయుల మహా ప్రదర్శనతో కార్యక్ర మం ప్రారంభమవుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సమావే శాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నటరాజ్, టీఎస్ యూ టీఎఫ్ వాంకిడి మండల కమిటీ సభ్యులు, సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.