calender_icon.png 22 November, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ మౌమిత కుటుంబానికి న్యాయం చేయాలి

17-08-2024 03:48:58 PM

రాజన్న సిరిసిల్ల: దుండగులచే అత్యాచారం గావించబడి, హత్యకు గురైన డాక్టర్ మౌమిత కుటుంబానికి న్యాయం చేయాలని సిరిసిల్ల ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ అసోసియేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా, బాధ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  శనివారం డాక్టర్ మౌమితకు న్యాయం చేయాలంటూ అంబేద్కర్ చౌక్ నుండి గాంధీచౌక్,  నేతన్న విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ... దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా నేటికీ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదన్నారు. డాక్టర్లపై దాడులు, అత్యాచారాలు భవిష్యత్తు తరాలకు మంచిది కాదని అన్నారు. మౌమితపై అత్యాచారానికి పాల్పడిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు శంకర్, మహేష్, నాయక్, రఘు, కృష్ణ, కే.సంతోష్, గౌస్, సౌమ్య సంతోష్ తదితరులు పాల్గొన్నారు.