17-08-2024 03:57:44 PM
కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లం లింగమూర్తి మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరిపి, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయ్యాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీల నుంచి బంగ పాటు తప్పదు అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ దేశంలో కులగణన బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ లో బీజేపీతో కొట్లాడుతుంటే ఆయన స్ఫూర్తితో పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ రిజర్వేషన్లు కల్పించే విషయంలో స్పష్టత లేకపోవడం శోచనీయం అని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలుకోరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ మేధావులు,ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకోవాలని ప్రభుత్వానికి చూచించారు,