14-12-2025 12:41:09 AM
ముషీరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయ వాది డాక్టర్ టి. సుభాషిణిని ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికారడ్స్ సౌత్ ఇండి యా కో-ఆర్డినేటర్ పదవి నుంచి ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్గా పదోన్నతి కల్పించినట్లు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికారడ్స్ చీఫ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.కె. ఆరట్స్ అండ్ కల్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు కె. రవి కుమార్, డాక్టర్ సుభాషిణికి కింగ్ కోటి కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులను గుర్తించి, వారికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సో్ల స్థానం కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా ఉన్న కో-ఆర్డినేటర్లను ప్రోత్సహిస్తూ సేవాభావంతో ముందుకు సాగాలని కోరారు. అనంతరం డాక్టర్ టి. సుభాషిణి మాట్లాడుతూ ఇప్పటివరకు తాను చేసిన కృషిని గుర్తించి యునైటెడ్ కింగ్‌డంలోని ప్రధాన కార్యాలయం జాతీ య అధ్యక్షుడు డా. మైక్ తనను ఈ పదవికి పదోన్నతి చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.