calender_icon.png 14 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19 నుంచి బుక్ ఫెయిర్

14-12-2025 12:42:22 AM

హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యూకూబ్

ముషీరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): పుస్తకం విశిష్టత, దాని ప్రయోజ నాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈనెల 19 నుంచి 29 వరకు ఎన్ టీ ఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు, కవి యూకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్. వాసు, ఉపాధ్యక్షుడు బాల్రెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి మాట్లాడారు.

పుస్తక పఠనం దాని ప్రాముఖ్యతను సమాజానికి తెలియజెప్పడంతో పాటు, మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈసారి పుస్తక విక్రయాలు, కొనుగోళ్లతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పుస్తక స్ఫూర్తి కార్యక్రమం ఉంటుందన్నారు. బాలోత్సవం పేరుతో పిల్లల కోసం ప్రత్యేక సెషన్లు, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయ న్నారు.

అలాగే తాజాగా హైదరాబ్పా జాతీయ స్థాయిలో వచ్చిన పుస్తకాలపై ప్రత్యేక సెషన్, బాలల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిపై ప్రత్యేక సెషన్ ఉంటుందన్నారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణాలు, వేదికలకు సాహిత్య రంగానికి విశేష కృషి చేసిన ప్రముఖులు అందెశ్రీ, అనిశెట్టి రజిత, కొంపల్లి వెంకట్ గౌడ్, ప్రొ.ఎస్.వి.రామారావు, స్వేచ్ఛ ఒటారికర్ పేర్లను పెడుతున్నట్లు చెప్పారు.