02-07-2025 12:00:00 AM
ఎంపీడీఓ శ్రీనివాస్ రావు
పెన్ పహాడ్, జూలై 1 : ప్రతి ఇంటిలో తప్పక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని అనంతారం గ్రామంలో సాచ్యురేషన్ పద్ధతిలో ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం కోసం ముగ్గులు పోసి గ్రామస్తులకు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించారు. తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వం రూ. 6వేలు అందిస్తుందన్నారు.
అలాగే ప్రస్తుతం వర్షాకాలం సమీపించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. గ్రామాల్లో పైపులు లీకేజీ అయిన వెంటనే సిబ్బంది ఎప్పటికప్పుడు పైప్ లైన్ లీకేజీలను మరమ్మతులు చేయాలన్నారు. కార్యక్రమం లో ఏపీఓ రవి, ఈసీ మహేష్, ఏకస్వామి, రాంకుమార్, బేగం తదితరులు ఉన్నారు.