12-09-2025 01:15:47 AM
మాజీ కార్పొరేటర్ వాజీద్ హుస్సేన్
ముషీరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): ముషీరాబాద్ లోని పఠాన్ బస్తీ అమీర్ గరీబ్ వీధిలో గత 10 ఏళ్ళుగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని భోలక్ పూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వాజీద్ హుస్సేన్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం జలమండలి జీఎం శ్రీధర్ రెడ్డిని కలిసి సమస్య పరిష్కారానికై వినతి పత్రం అందజేశారు. అనంతరం వాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ అమీర్ గరీబ్, జరారా హోటల్ వీధిలో నిత్యం పొంగుతున్న మ్యాన్ హోల్ మురుగు నీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు.
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ స్థానిక సమస్య పరిష్కారానికై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పలు మార్లు అధికారులకు ఫిర్యాదు సైతం చేశారని తెలిపారన్నారు. డ్రైనేజీ సమస్య వల్ల కలుషిత నీటి సరఫరా తోపాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నా రు. వెంటనే సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ జలమండలి డీజీఎం మోహన్ రాజ్, డాక్టర్ మినాజ్ తదితరులు పాల్గొన్నారు.