calender_icon.png 7 August, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రామా బ్రదర్స్ రాజకీయాలకు చరమగీతం

05-08-2025 12:17:55 AM

 అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చకు సిద్ధమా

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి 

నల్లగొండ టౌన్, ఆగస్టు 4 : కోమటిరెడ్డి డ్రామా బ్రదర్స్ ఆటలకు చరమగీతం పాడుతామని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమకు సహకరిస్తే ఒక రకంగా సహకరించకపోతే ఒక రకంగా మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఆది నుండి అలవాటేనని అన్నారు.

ఎన్నో దశాబ్దాలు గా నల్లగొండ నడి బొడ్డులో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన క్యాంప్ ఆఫీసుగా మార్చడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. గడియారం చౌరస్తాలో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు  మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు వచ్చినప్పుడు సేదతీరే వారని అలాంటి గెస్ట్ హౌస్ ను క్యాంపు ఆఫీసుగా మార్చడం వల్ల నల్లగొండకు వచ్చే అతిధులు ఎక్కడ బస చేస్తారని వర్షిత్ రెడ్డి ప్రశ్నించారు. 

నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధిపై దమ్ము ధైర్యం ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. క్లాక్ టవర్ సెంటర్లో కానీ, మంత్రి సొంత గ్రామంలో గాని బహిరంగ చర్చకు సిద్ధపడా లని సవాల్ విసిరారు.  క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవాన్ని మంత్రి దొంగచాటుగా ప్రారం భించాడని విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే కోమటిరెడ్డి ఇందిరా భవన్ ప్రారంభోత్సవం పేరిట ఎందుకు కార్యక్రమాన్ని ప్రకటించలేదని నాగం వర్షిత్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య యుతంగా ఆందోళన చేసేందుకు యత్నించిన బిజెపి కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని ఆరోపించారు.  పోలీసులు శాంతిభద్రతలను కాపాడకుండా కాంగ్రెస్ కార్యకర్తలలా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పిల్లి రామరాజు యాదవ్, పోతేపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.