calender_icon.png 22 November, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రీమ్ థియేటర్‌లో అడుగుపెట్టింది!

21-11-2025 12:00:00 AM

శివరాజ్‌కుమార్, ధనంజయ ప్రధాన పాత్ర ల్లో దర్శకుడు హేమంత్ ఎం రావు తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. వైశాఖ్ జే ఫిల్మ్స్ బ్యానర్‌పై డాక్టర్ వైశాఖ్ జే గౌడ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ డిసెంబర్ తొలివారంలో ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోందని తాజాగా ఈ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రియాంక తమిళం, తెలుగు, కన్నడ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచు కుంది. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌తో ‘ఓజీ’లో, నానితో ‘సరిపోదా శనివారం’లో, ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’లో నటించటం ద్వారా దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.