calender_icon.png 22 November, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటులను దేవుడిలా ఆరాధించడం ఇక్కడే చూశా!

21-11-2025 12:00:00 AM

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు పీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ విలేకరుల సమావేశం లో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు.

“-అభిమానం అనేది డివైన్ ఎమోషన్. నేను నార్త్ నుంచి సౌత్‌కొచ్చినప్పుడు ఇక్కడ అభిమానుల అభిమానం చూసిన తర్వాత ఒక స్టార్‌ను ఇంత గొప్పగా ఆరాధిస్తారో, ప్రేమిస్తారో ప్రత్యక్షంగా చూశాను. ఎలాంటి రిలేషన్ లేకుండా పరిచయం లేకుండా ఒక వ్యక్తిని అంతలా ఎలా అభిమానిస్తారనిపించేది నిజంగా చాలా గొప్ప ఎమోషన్. మహేశ్ ఈ కథ చెప్పిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.

ఈ సినిమాలో నేను మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తా. తను కాలేజ్ అమ్మాయి. సాగర్‌తో ప్రేమలో ఉంటుంది. కథలో తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్ ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. -ఇందులో సాగర్, మహాలక్ష్మిల ప్రేమకథ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. రామ్‌తో నటించడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. వెరీ ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేశానని అనుకుంటున్నా.

లవ్‌స్టొరీ, డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. రామ్ చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఇది పిరియడ్ సినిమా. 2000లో జరిగే కథ, డైరెక్టర్ కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ అన్నిటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది. నేను ఎలా అనుకుంటున్నానో చేసి చూపిస్తానని డైరెక్టర్‌కు రిక్వెస్ట్ చేశాను. నేను చేసింది అందరికీ నచ్చింది.

అంత క్రియేటివ్ స్పేస్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాకోసం ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో నాకు తెలియదు. అయితే వచ్చిన ప్రతి క్యారెక్టర్‌కు 100% ఇచ్చి ఒక వెర్సటైల్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. అనుష్క ‘అరుంధతి’లో చేసిన పాత్రలు చాలా ఇష్టం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నా” అని తెలిపింది.