calender_icon.png 14 August, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవింగ్ శిక్షణ పొందేవారు డ్రంక్ అండ్ డ్రైవ్‌కి దూరంగా ఉండాలి

14-08-2025 12:38:24 AM

భద్రాచలం, ఆగస్టు 13, (విజయ క్రాంతి) డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటున్న యువకులు డ్రంక్ అండ్ డ్రైవ్ కి దూరంగా ఉండి శిక్షకులు డ్రైవింగ్లో నేర్పించే మెలకువలు శ్రద్ధగా విని ఎటువంటి సంకోచం, భయాలు లేకుండా డ్రైవింగ్ నేర్చుకున్న వారికి శిక్షణ అనంతరం డ్రైవింగ్ లైసెన్సులు అందజేయడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ యువకులకు సూచించారు.

బుధవారం ఐటీడీఏ ప్రాంగణంలోని వై టి సి లో డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటున్న యువ కుల శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుణ్ మోటర్, మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్ వారి సౌజన్యంతో వైటీసీలో డ్రైవింగ్ శిక్షణ తీసుకునే యువకులు డ్రైవింగ్ శిక్షణతో పాటు మీకు తెలిసిన వారిని సంప్రదించి

ఉద్యోగ అవకాశాల కోసం వివరాలు సేకరించి ప్రైవేట్ సంస్థలో నైనా ఉద్యోగ అవకాశాలు పొంది జీవనోపాధి పెం పొందించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్ శిక్షకురాలు మల్లేశ్వరి, సిబ్బంది సమ్మయ్య, వినీత యువకులు తదితరులు పాల్గొన్నారు.