14-08-2025 12:36:32 AM
ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మణుగూరు, ఆగస్టు13 (విజయ క్రాంతి) : ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతే పినపాక నియోజకవర్గంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అ న్నారు. పట్టణంలోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో మున్సిపాలిటీ పరిధిలోని అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను బుధవారం ఆయన పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు పదేళ్ల కాలంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లిన, ఏ గ్రామానికి పోయి చూసిన గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇల్లు దర్శన మిస్తున్నాయన్నారు. చెప్పిన విధంగానే అభివృద్ధి, స క్షేమ కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గా న్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సహకార మవుతుందన్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అ ధ్యక్షులు పిరీనాకి నవీన్, తహసిల్దార్ అద్దంకి నరేష్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.