16-11-2025 12:00:00 AM
హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్
మేడ్చల్, నవంబర్ 15(విజయ క్రాంతి): పరస్పర రాజీతోనే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని హైకోర్టు న్యాయ సేవలు కమిటీ చైర్మన్ జస్టిస్ కె లక్ష్మణ్ అన్నారు. కుషాయిగూడ లోని జిల్లా న్యాయస్థానాల భవన సముదాయంలో జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమానికి జస్టిస్ లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యుడిషియరీ విభాగంలో అధునాతనీకరణలో భా గంగా వచ్చిన ఈ -కోర్టులో, లైవ్ స్ట్రిమింగ్స్, 18 భాషల్లో తీర్పులను వ్బుసైట్లో అప్లోడ్ చేయడం శుభ పరిణామం అన్నారు.
1977 నుంచి అపరిస్కృతంగా ఉన్న కుటుంబ తగాదాకు సంబంధించిన కేసు లోకదాలతోనే పరిష్కారమై తన చేతుల మీదుగా జడ్జిమెంట్ అవార్డు అందించడం సంతోషంగా ఉందన్నారు. పరస్పర రాజీ వల్ల కక్షిదారులకు సత్వర న్యాయం జరగడమే గాక మానసిక ఒత్తిడి తగ్గుతుందని, సమయం వృధా కాదని అన్నారు. కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకోవడం వల్ల ఖర్చు లేకుండా సమస్యకు పరిష్కారంతోపాటు ఉపశమనం పొందవచ్చు అన్నారు.
లోకదాలతో ద్వారా కక్షిదారులు సమస్యలు నేరుగా చెప్పుకొని అర్థవంతమైన, నిష్పక్షపాతమైన ఉచిత న్యాయ సేవలు త్వరగా పొందవచ్చు అన్నా రు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు ఈ సేవలు వినియోగిం చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెషన్ జడ్జి శ్రీదేవి, డీసీపీలు పద్మజా రెడ్డి, సుధీర్, జడ్జిలు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.