calender_icon.png 30 December, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనీస్ మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు

30-12-2025 01:40:48 AM

వికారాబాద్, డిసెంబర్ -29: గాలిపటాలు ఎగురావేయడానికి చైనిస్ మాంజా ను ఉపయోగించవద్దు అని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) విక్రయించడం, నిల్వ చేయడం, వాడటంపై ప్రభుత్వం నిషేధం విధించిందని, పర్యావరణానికి, పక్షులకు మరియు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నరు. ఈ ప్రమాదకరమైన మాంజా ను విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

ఈ దారం గాలిపటాలు ఎగురవేసే సమయంలో మెడకు లేదా శరీర భాగాలకు తగిలితే తీవ్రమైన గాయాలు కావడమే కాకుండా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని, గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. జిల్లాలోని ఫ్యాన్సీ షాపులు, గాలిపటాల విక్రయ కేంద్రాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎక్కడైనా నిషేధిత చైనీస్ మాంజా కనిపిస్తే వెంటనే వాటిని సీజ్ చేయడమే కాకుండా సంబంధిత విక్రేతలపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. కేవలం వ్యాపార లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆమె వ్యాపారులకు సూచించారు.