calender_icon.png 2 January, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సర వేడుకల వేళ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

02-01-2026 12:53:01 AM

అర్ధరాత్రి తర్వాత క్షేత్రస్థాయిలో పోలీస్‌ల విధులు:  ఎస్పీ జానకి 

మహబూబ్ నగర్, జనవరి 1 (విజయక్రాంతి):  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగిందని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి  తెలిపారు. ఈ తనిఖీలు జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడగా, మొత్తం 86 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ఎస్పీ వెల్లడించారు. వీరిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి, న్యాయస్థానాలకు హాజరుపరిచే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

అర్ధరాత్రి అనంతరం పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో తనిఖీలు భవిష్యత్తులో కూడా ఇటువంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. నూతన సంవత్సర సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కొత్త సంవత్సరంకేక్ కట్ చేసి కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సూచనలు చేశారు.