02-01-2026 12:52:07 AM
జిష్ణుదేవ్‌వర్మను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం లోక్‌భవన్‌లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు కాసేపు చర్చించికున్నట్లు సమాచా రం. గవర్నర్ కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శిశధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదేవి ధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రు లు, అధికారులు, పార్టీ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజ్‌ఠాకూర్, సీఎస్ రా మకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, పార్టీ నా యకులు రేవంత్‌రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.