23-12-2025 12:00:00 AM
సర్పంచ్ అభ్యర్థులను అభినందించిన
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
అర్మూర్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : గ్రామంలో ఇచ్చిన హామీలు తను నెరవేరుస్తానని బీజేపీ అభ్యర్థులు అధికార పార్టీ కి చెందిన సీనియర్ నాయకులను తమ అభ్యర్థులు ఓడించార ని ఎమ్మెల్యే పై రాకేష్ రెడ్డి అన్నారు. కల్లెడ సర్పంచ్ ప్రళయ తేజ సుప్రియ. కంఠం సర్పంచ్ సాయినాథ్,సిద్దాపూర్ సర్పంచ్ మహేశ్, మరంపల్లి సర్పంచ్ గంగాధర్,అన్నారం సర్పంచ్ సంజీవ్ వారి గ్రామాలకు వెళ్లి శాలువాతో వారిని ఎమ్మెల్యే సన్మానించారు.
సోమవారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మొదట ముల్లంగి గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి హాజరై శాలువాతో సన్మానించి ఆయన మాట్లాడారు సర్పంచ్ ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందజేసే బాధ్యత సర్పంచుల పై ఉందనీ అని పార్టీలకు అతీతంగా సర్పంచులు పని చేయాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆలూరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్,నందిపేట్ మండల అధ్యక్షుడు పటేల్ రాజు,డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం ఉత్సవాలు
నిజాంసాగర్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రజల పౌరుల ప్రమాణ స్వీకార మహోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. గ్రామ ప్రత్యేక అధికారులు సర్పంచులు,ఉప సర్పంచులు, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో...
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : మండలంలోని 25 గ్రామాలలో నూతన గ్రామ సర్పంచులు,ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లు ప్రమాణం స్వీకారం చేశారు.గ్రామాలలో సర్పంచులు ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా గ్రామాలు అన్ని సందడిగా ఏర్పడ్డాయి. ముందుగా నాయకులు గ్రామ స్తులతో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లారు.అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం శాలువలతో సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డు మెంబర్లు శాలువలతో సత్కరించుకున్నారు.సుమారు రెండు సంవత్సరాల అనంతరం పల్లెలకు ప్రత్యేక అధికారుల పాలనతో విముక్తి లభించింది.గత సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ సర్పంచులు వార్డు మెంబర్ల పదవి కాలం ముగిసింది.
దీనితో ఎన్నికలు జరిగే వరకు గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రవేశపెట్టింది.జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కొత్త పాలనకు పంచాయతీలు ముస్తాబయ్యాయి.మండల అధికారులు సర్పంచులతో ప్రమాణస్వీకారం చేయించారు.కొత్త గ్రామపంచాయతీ కొలువుతీరిన అనంతరం ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరవేరాల చూస్తామని ప్రతిజ్ఞ చేశారు.గ్రామాలను అన్ని రంగాలుగా ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు.పలుచోట్ల కొత్త సర్పంచులు సొంత ఖర్చులతో జిపి భవనాలకు రంగులు ఏమైనా మరమ్మత్తులు ఉంటే చేయించారు.రెండు సంవత్సరాల నిరీక్షణకు తేరపడింది.
గత రెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు అవుతున్న పాలకవర్గం గ్రామాలలో విద్య, వైద్యం,తాగునీరు, రహదారులు,విద్యుత్, పారిశుద్ధ్యం,కాలువలు, వ్యవసాయ బావులు, చెరువుల అభివృద్ధి లాంటి మౌలిక సదుపాయాల అంశాలపై దృష్టి సాధించవలసి ఉంది.అయితే ఈసారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే ఉన్నారు.పాలన అనుభవం, రాజకీయాము నేపథ్యం లేనివారే ఎక్కువ మరోవైపు ఎన్నికల ప్రచారంలో గ్రామాలకు అభివృద్ధి చేస్తామని అన్ని సమస్యలు పరిష్రావిస్తామని అనేక హామీలు ఇచ్చారు.్ర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లు, ప్రత్యేక అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
విద్యాభివృద్దే లక్ష్యంగా సేవలు ః నూతన సర్పంచ్ గంగాధర్
కమ్మరపల్లి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఎందరో విద్యావంతులు ఉన్న మన గ్రామంలో విద్యాభివృద్ధి లక్ష్యంగా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తానని హాస కొత్తూరు గ్రామ సర్పంచ్ రేవతి గంగాధర్ అన్నారు. పదవి భాద్యతలు చేపట్టాక మొదటగా స్థానిక ఉన్నత పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతు మంచి ఫలితాల సాధాన కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ శ్రీ తో పాటు ఉపాధ్యాయులు సర్పంచ్ గంగాధర్ తో పాటు ఉప సర్పంచ్ మనోహర్ శ్రీనివాస్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.