calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దసరా కప్’.. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన...

24-09-2025 12:00:00 AM

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, సెప్టెంబర్ 23, (విజయక్రాంతి):దసరా సెలవులు సందర్భంగా భ ద్రాచలం కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే తె ల్లం వెంకట్రావు చేతుల మీదుగా మంగళవా రం ప్రారంభం కాగా టోర్నమెంట్ ప్రారంభానికి ఐటీసీ కాంట్రాక్ట్ పాకాల దుర్గాప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ టోర్నమెంట్ 23 నుంచి 29 వరకు క్రికెట్ జరగనుంది. ఈ టోర్నమెంట్ కి హైదరాబాద్, మహబూబ్నగర్ , కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం 5 జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు చేత న బెస్ట్ క్రికెట్ అకాడమీ కోచ్.. కుప్పాల చర ణ్ తేజ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ కే అజీము, ఎమ్మెల్యే ప్రోగ్రాం ఇంచార్జి నవాబ్, క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, కోచ్ తేజ, ధన్యవాదాలు తెలియజేశారు.