04-08-2025 12:42:09 AM
కామారెడ్డి, ఆగస్ట్ 03,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో క్రీడా భారతి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలోని వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు యువతకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
క్రీడల కు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా శారీరక దారుఢ్యం, ఆత్మ ధైర్యం నెలకొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పన్యాల బాపురెడ్డి, జైపాల్ రెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు, దత్తు జిల్లా వాలీబాల్ క్రీడా భారత్ కోశాధికారి మాజీ జెడ్పిటిసి ఆర్చరీ జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్ , దోమకొండ ఎక్సైజ్ ఎస్త్స్ర దీపిక , ఏ శ్రీనివాస్ దోమకొండ ఏఎస్‌ఐ, కదిరే మోహన్ రెడ్డి, అంబటి అనిల్ కుమార్, బాలకృష్ణ, సాయి మౌర్య,పీఈటి దోమకొండ. అబ్ర బోయిన సిద్ధరాములు, జి. నరేష్ సరికొండ మణిత్ రెడ్డి, సిరికొండ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.