calender_icon.png 17 July, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండోనేషియాలో భూకంపం

15-07-2025 12:00:00 AM

రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదు

బాలి, జూలై 14: ఇండోనేషిలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్టు జర్మన్ రీసెర్చ్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జడ్) పేర్కొంది. భూకంపకేంద్రం తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. సునామీ వచ్చే అవకాశాలు లేవని జిఎఫ్‌జడ్ వెల్లడించింది. తూర్పు ఇండోనేషిలోని పలు నగరాల్లో ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది.

ఎటు వంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు రిపోర్టులు వెలువడలేదు. రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే అగ్నిపర్వతాల జోన్‌లో ఇండోనేషియా ఉండటంతో అక్కడ భూకంపాలు సర్వసాధారణంగా వ స్తూ ఉంటాయి. జాతీయ విపత్తు బృందాలు రంగంలోకి దిగి సహాయ క చర్యలను ప్రారంభించాయి. ఇం డ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దె బ్బతిన్నట్టు అధికారులు పేర్కొన్నారు.