10-09-2025 12:17:42 AM
రూర్బన్ మిషన్ ద్వారా రూ.75 లక్షలు మంజూరు
శ్రీ తిరుమలనాథ స్వామి గుట్టపై ఆవిష్కృతం అవుతున్న ఏకో పార్క్
మహమ్మదాబాద్, సెప్టెంబర్ 9: ప్రశాంతమైన వాతావరణం.. చిలకల కేరింతలు.. అ బ్బురపరిచే ప్రకృతి ఆశ్చర్యానికి గురిచేసే అ టవీ సంపద మహబూబ్ నగర్ జిల్లాలోని మహమ్మదాబాద్ మండలం జూలపల్లి అట వీ ప్రాంతానికి సొంతం. ఈ అటవీ ప్రాం తంలో ఒక గుట్టపై శ్రీ తిరుమలనాథ స్వామి కొలువు తీరారు. దశాబ్దాల తరబడి భక్తులు స్వాములవారికి ప్రత్యేక పూజలు చేయడం తో పాటు అటవీ ప్రాంతంలోని విరజిల్లుతున్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వస్తున్నారు.
ఈ తరుణంలోనే ప్రభుత్వం రూర్బన్ ప్రాజెక్టు కింద ఉమ్మడి గండిడ్ మండలాన్ని ఎంపిక చేసింది. ఎంపిక చేసి సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో మహమ్మదాబాద్ మరో మండల కేంద్రంగా ఏర్పాటు అయిన విషయం విధితమే.
ఈ మండల పరిధిలోకి వచ్చిన జూలపల్లి అటవీ ప్రాంతంలో రూ ర్బన్ ప్రాజెక్టు కింద రూ 75 లక్షలు మంజూ రు చేసి జూలపల్లి అటవిలోని చింతగట్టు తిరుమలనాథ స్వామి ఆలయంలో పరిసర ప్రాంతంలో అద్భుతమైన పర్యావరణ సహి త సహజ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసు కుంది.
ఈ తరుణంలో ఆ ప్రాంతం మరింత ఆకర్షనీయంగా మారనుంది. పర్యటకుల సై తం ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఇప్పటినుంచే ఆసక్తి కనపరుచుతు న్నారు.
-స్వచ్ఛమైన వాతావరణం ఏకో పార్క్ సొంతం
పూర్తిగా అటవీ ప్రాంతంలో ఈ ఏకో పా ర్కు ఏర్పాటు చేయడం ద్వారా స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యటకు లు సైతం ప్రత్యేక ఆకర్షణంగా నిలువనున్నది. అటవీ ప్రాంతానికి చెందిన 47 ఎకరా లలో ఈ ఏకో పార్కును ఏర్పాటు చేసేందుకు ఫారెస్ట్ అధికారులు అడుగులు వేస్తున్నా రు.
ఇప్పటికే పండ్లు ప్రారంభించిన మ రింత తక్కువ సమయంలోనే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు సంబంధిత అధికార యంత్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ తరుణంలో జిల్లా అదనపు కలె క్టర్ శివేంద్ర ప్రతాప్ సైతం ప్రత్యేకమైన దృ ష్టి కేంద్రీకరించారు. ఏకో పార్కులో అవసరమైన సదుపాయాలు అన్ని అందుబాటు లోకి తెచ్చేలా చర్యలు మరింత ముమ్మరం చేస్తున్నారు.
- అందరి దృష్టి జూలపల్లి అటవీ ప్రాంతం వైపు..
47 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ పా ర్కులో యోగా. ధ్యానమందిరం, చిన్నపిల్లల పార్కు, రెండు వాకింగ్ ట్రాక్లు, పహరిగోడా, నీటి ఫౌంటైన్, తాగునీటి వసతులు, టాయిలెట్లు, ఫెన్సింగ్ అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులు సమయతమవుతున్నారు.
చింతగట్టు శ్రీ తిరుమలనాథ స్వా మి గుడి చుట్టూ పరిసరాలు. రమణీయంగా, చూడచక్కగా. ప్రకృతి అందాలు అందరినీ ఆకర్షింప చేస్తాయని పర్యటకులు మరింతగా పెరుగుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తి అయితే పర్యటకులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తారని పరులు పేర్కొంటున్నారు.
పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం..
ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుం డా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పక్క ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. వీలైనంత త్వరగా ఈ పార్కు వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మంచి వాతరంలో ఏకోపాకు ఏర్పాటు చేయడం వల్ల పర్యటకుల సైతం భారీగా వచ్చే అవకాశం ఉంది. మునుముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అవసరమైన పనులను చేసుకుంటూ అద్భుతంగా అందరికీ అందు బాటులోకి తీసుకు వస్తాం.
రాఘవేందర్, ఫారెస్ట్ ఆఫీసర్, మహబూబ్ నగర్ జిల్లా