calender_icon.png 15 May, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, వైద్యం ప్రభుత్వ ప్రధాన ఎజెండా

15-05-2025 02:27:13 AM

  1. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 
  2. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత

మెదక్, మే 14(విజయక్రాంతి): రాష్ట్ర ప్ర భుత్వం విద్య, వైద్యం ప్రధాన ఎజెండాగా పనిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మై నంపల్లి రోహిత్రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధిం చిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్ట ర్ రాహుల్ రాజ్, ఇంటర్మీడియట్ అధికారిని మాధవి, సంబంధిత కళాశాల ప్రిన్సిప ల్స్తో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రా వు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళా శాలలో కార్పొరేట్ స్థాయికి ధీటుగా విద్యా బోధన జరుగుతుందని, కష్టపడి చదువుకుని ఈరోజు ఉన్నత స్థానంలో మంచి ఫలితాలు సాధించి ప్రతిభా పురస్కారాలు అందుకోవ డం  అభినందనీయమని తెలిపారు.

ప్రభు త్వం విద్యా, వైద్యం ప్రధాన అజెండాగా ముందుకు  పోతుందని, శాసనసభ్యులుగా గెలుపొందిన 14 నెలల్లో క్షేత్రస్థాయిలో ప్ర భుత్వ పాఠశాలలు పరిశీలించినప్పుడు బాలికలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడే వారిని అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు వసతిని కల్పించామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తూ  ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు ఈ ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమం ఇది మీ ఒక్కరికే సన్మా నం కాదని మీ కాలేజీల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి సన్మానం లాగా భావించాలని కలెక్టర్ అన్నారు.  అనంతరం ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 200 మంది విద్యార్థినీ విద్యార్థులను, 50 కళాశాల ప్రిన్సిపాల్‌ను ఎమ్మెల్యే, కలెక్టర్ సన్మానించారు.