calender_icon.png 17 August, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యే నూతన భవిష్యత్తుకు పునాది-

16-08-2025 12:00:00 AM

త్రిదండి చిన్న జీయర్ స్వామి

నాగర్ కర్నూల్ ఆగస్టు 15 విజయక్రాంతి తరగతి గదిలోని ప్రాథమిక విద్య దేశ భవిష్యత్తుకు పునాదిరాయి లాంటిదని త్రిదండి చిన్న జీయర్ స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దనూరు గ్రామంలో ఎన్నారై చిట్టినేని శ్రీనివాసరావు తన తల్లిదండ్రులు కౌసల్యమ్మ బాలకిషన్ రావుల జ్ఞాపకార్థం కోటి 80 లక్షలు ఖర్చులతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణాన్ని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డిలతోపాటు ప్రారంభించారు. 

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు  క్షీణిస్తున్నాయని కొంతమంది అపారమైన డబ్బు సంపాదించినప్పటికీ విలాసాలకు ఖర్చు చేయడం పరిపాటిగా మార్చుకున్నారని అభిప్రాయపడ్డారు. కానీ సొంత గ్రామస్తుడు ప్రవాస భారతీయుడుగా ఎదిగినప్పటికీ తాను పుట్టిన ఊరు ఆ పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాల నూతన భవనం నిర్మాణం చేపట్టడం ఎంతో శుభ సూచకమన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సైతం వారిని స్ఫూర్తిగా తీసుకొని విలువలతో కూడిన విద్యను పొందాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ప్రభుత్వ పాఠశాలల బర్లోపేతం కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దానికి తోడు ఇలాంటి దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ కూచుకుళ్ల ఫౌండేషన్ తరఫున జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు గ్రీన్ బోర్డులు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులుపాల్గొన్నారు.