24-09-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 23 ,(విజయక్రాంతి,)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాశయానికి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు, 405.50 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి నేటి సామర్థ్యం 407 అడుగులు. గత రెండు రోజులుగా జిల్లాల కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు జలాశయానికి చేరుతోంది. కొత్తగా 5000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో జెన్కో అధికారులు జలాశయం భద్రత దృష్ట్యా మంగళవారం రాత్రి ఒక గేటును ఐదు అడుగులు ఎత్తి 5000 క్యూసెక్కుల నీటిని బయటికి పంపనున్నారు.