calender_icon.png 24 December, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూప్రాన్‌లో ఘనంగా రైతు దినోత్సవం

24-12-2025 12:25:02 AM

తూప్రాన్, డిసెంబర్ 23 :తూప్రాన్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో రైతు దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ మండ ల వ్యవసాయ అధికారి గంగుమల్లు రెడ్డి హాజరై రైతుల సేవలను ప్రశంసించారు. రై తు దేశానికి వెన్నెముక అని, వారి కృషి వల్లే మనకు ఆహార భద్రత సాధ్యమవుతోందని ఆయన అన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ యువత వ్యవసాయ రంగంపై ఆసక్తి చూపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొంపల్లి జోన్ ఏజీ ఎం జి.వి. రమణ రావు, కె. శ్రీనివాస్ రావు, కో ఆర్డినేటర్ రవి, అసోసియేట్ కో ఆర్డినేటర్ సోమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ రామ కృష్ణ పాల్గొనగా విద్యార్థులు రైతుల గొప్పతనాన్ని చాటిచెప్పే ప్రసంగాలు, కవితలు, నా టికలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ అశోక్ రెడ్డి, ఐకాన్ ఇన్చార్జ్ రాజేష్ రెడ్డి, సి బ్యాచ్ ఇన్చార్జ్ రమేష్, ప్రైమరీ ఇన్చార్జ్ కలావతి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.