09-07-2025 12:32:30 AM
నిర్మల్, జూలై 8(విజయ క్రాంతి): నిర్మల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని నిధులైన తీసుకొస్తానని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం దిల్వార్పూర్ మండలంలోని మాయాపూర్ గ్రామంలో 30 లక్షలతో నిర్మించే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అనంతరం సోన్ మండల కేంద్రంలో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు 67 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు సత్యనారాయణ గౌడ్ రావుల రామనాథ్ మార గంగారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.