calender_icon.png 9 July, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైపులైన్ వేశారు.. కనెక్షన్ మరిచారు..

09-07-2025 12:31:51 AM

- రెండు నెలలుగా నిలిచిపోయిన నీటి సరఫరా

- ఇబ్బందులు పడుతున్న విద్యారణ్యపురి కాలనీవాసులు

కరీంనగర్ క్రైం, జూలై 8 (విజయ క్రాంతి): మంచినీటి సరఫరా కోసం పైపులైన్ వేసి కాంట్రాక్టర్ కనెక్షన్ ఇవ్వకపోడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రెండు నెలలుగా మంచినీటి కోసం కాలనీవాసులు ఇ బ్బందులు పడుతున్న సంఘటన కరీంనగర్లో చోటుచేస్తుంది. నగరంలోని తీగలగుట్టపల్లి పరిధిలోని విద్యారణ్యపురి రోడ్ నెం. 21/ఏ వద్ద మంచినీటి సరఫరా కోసం అమృత్-2 కింద పైపులైన్ వేశారు.

కానీ కాంట్రాక్టర్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో కాలనీవాసు లు రెండు నెలలుగా మంచినీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. కనెక్షన్ ఇవ్వాలని కాంట్రాక్టర్ ను కోరితే ఇది కేంద్ర ప్రభుత్వ స్కీం అని, కనెక్షన్ కు అమర్చే పరికరాలు లేవని కాంట్రాక్టర్ చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని కాలనీవాసులు తెలుపుతున్నారు. అంతకుముందు 2 ఇంచుల పైపులైన్ ఉండగా మంచినీటి సరఫరా అయ్యేది.

కానీ దానిని తొలగించి అమృత్-2 కింద కొత్తగా 4 ఇంచుల పైపులైన్ వేశారు. కానీ కనెక్షన్ ఇవ్వకపోడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. 500 రూపాయలకు ఒక ట్యాంకర్ చొప్పున నీటిని కొను క్కుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనెక్షన్ ఇప్పించి మంచినీటి ఇక్కట్లను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

కనెక్షన్ ఇచ్చి మంచినీటి ఇబ్బందులు తొలగించాలి: కృష్ణమోహన్, విద్యారణ్యపురికాలనీ, తీగలగుట్టపల్లి, కరీంనగర్

కేంద్ర ప్రభుత్వం అమృత్-2 పథకం కింద పైపులైన్ వేశారు. కానీ కనెక్షన్ ఇవ్వలేదు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నీళ్లను కొనుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైన్ కనెక్షన్ ఇచ్చి మంచినీటి ఇబ్బందులుతొలగించాలి.