09-07-2025 12:33:21 AM
వేములవాడ టౌన్: జూలై 8, (విజయ క్రాంతి); భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందిన పురుషోత్తపట్నం గ్రామంలోని దేవస్థాన భూములను పరిరక్షించేందుకు వెళ్లిన భద్రాచలం ఆలయ కార్య నిర్వహణ అధికారి రమాదేవి, అర్చకులు మరియు సిబ్బందిపై జరిగిన దాడిని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ ఉద్యోగుల యూనియన్ తరపున తీవ్రంగా ఖండించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులపై దాడులు జరగడం తీవ్ర ఆవేదనను కలిగిస్తుందని.
ఆలయ భూములను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న అధికారులకు ఇ దొక నిరుత్సాకర పరిణామం అన్నారు.ఇటువంటి దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేములవాడ దేవస్థానం యూనియన్ తరపున డిమాండ్ చేశారు. అలాగే ఆలయ భూములను పరిరక్షించేందుకు కార్యాచరణలో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కూరగాయల శ్రీనివాస్, ఏ ఈ ఓ లు, పర్యవేక్షకులు, అర్చకులు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది , వేదపండితులు మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.