calender_icon.png 12 December, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలి

11-12-2025 12:00:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),డిసెంబర్10: పోలింగ్ సిబ్బంది ప్రజాస్వామ్య పద్ధతిలో నిష్పక్షపాతంగా,బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని ఎన్నికల అధికారి జిల్లా,కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు.బుధవారం మండల కేంద్రం అర్వపల్లి లోని శ్రీరామ గార్డెన్స్ లో మండలంలోని 17 గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికా రులు, పీఓ, ఓపీఓల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఓలు, ఓపీఓలు పోలింగ్ సామాగ్రిని బ్యాలెట్ బాక్స్ లను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని చెప్పా రు. పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్కు జోనల్ ఆఫీసర్ తో వెళ్లి సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పోలింగ్కు అనుకూలంగా అన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

నేటి ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించాలని, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ లైన్ లో ఉన్నట్లయితే పై అధికారుల అనుమతితో పోలింగ్ నిర్వహించాలని చెప్పారు .పోలింగ్ కేంద్రాల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని, అనుకోని సంఘటనలు జరిగితే మండల టీంకు సమాచారం అందించాలని చెప్పారు.

తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఓట్ల లెక్కింపులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో లెక్కింపు జరపాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన పిదప స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లు ఫలితాలు వెల్లడించే ముందు జిల్లా ఎన్నికల అధికారి,జనరల్ అబ్జర్వర్ అనుమతి తీసుకుని తుది ఫలితాలు ప్రకటించాలని తెలిపారు. ఆర్డీఓ వేణుమాధవరావు, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీఓ గోపి, ఎంఈఓ బాలునాయక్ పాల్గొన్నారు.