11-12-2025 12:00:00 AM
ఎస్పీ నరసింహ
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్10: నేడు జరిగే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించా లని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. బుధవారం మండలంలోని జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం, అడివెంల, కుంచమర్తి గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవలసిన చర్యలను, అక్కడి ఏర్పాట్లను పరిశీలించి విధినిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రికి ఎన్నికల అధికారులకు పటిష్ఠ భద్రత కల్పించాలని, ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ నాగేశ్వర్ రావు, ఎస్త్స్ర సైదులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.