calender_icon.png 31 January, 2026 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌తో ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భేటీ

31-01-2026 12:44:41 AM

జనగామ, జనవరి 30 (విజయక్రాంతి): మున్సపిల్ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై వివరించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ అబ్జర్వర్గా నియమితులైన తెలంగాణ భాషా, సాంస్కృతి శాఖ డైరెక్టర్ ఎ. నర్సింహరెడ్డి (ఐ.ఏ.ఎస్.,) శుక్రవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తన ఛాంబర్లో భేటి అయ్యరు, పూల బోకేను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో జనగామ మున్సిపాలిటీ 30 వార్డులు, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలలో 18 వార్డుల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లపై సాధారణ అబ్జర్వర్కు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వివరించారు.

ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు గ్రామపంచాయితీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన  టీచర్లను, రెవెన్యూ, ఇజిఎస్  పనిచేస్తున్న అధికారులను నియమించామని ఆయన తెలిపారు. ఎన్నికల నిబందనలు అనుగుణంగా  పూర్తిస్ధాయి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్య లు తీసుకున్నామని కలెక్టర్, అబ్జర్వర్ వివరించారు. ఈ బేటిలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీ సిఇఓ మాదురి షా , జనగామ మున్సిపల్  కమీషనర్ మహేశ్వర్ రెడ్డి,  ప్రాజెక్టు డైరెక్టర్ (హౌసింగ్ ) మాతృనాయక్ , తదితరులు పాల్గొన్నారు.