31-01-2026 12:42:58 AM
కాకతీయ యూనివర్సిటీ, జనవరి 30,(విజయక్రాంతి): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సిట్ విచారణ రాజకీయ కక్ష సాధింపు చర్య అని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట బి ఆర్ ఎస్ వికే యూ ఇంచార్జి డాక్టర్ జట్టి రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రజా పాలన ప్రభుత్వం కాదు ప్రతికార పాలన ప్రభుత్వం అని విమర్శించారు.
రాష్ట్రంలో రోజురోజుకు రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇటువంటి చర్యలను సహించేది లేదని, ఈ రేస్ పేరుతో కేటీఆర్ ను ఫోన్ టాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ను విచారించడంతోపాటు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు కేసీఆర్ పైనే సీట్ విచారణకు పూనుకోవడం దారుణమైన తప్పిదమన్నారు.ప్రతి ఎలక్షన్ల ముందు ఏదో ఒక పేరుతో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వేధించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడడం అనాగరిక చర్య, సాధింపు చర్యల్లో భాగంగా ఈ విచారణను చేస్తున్నాడని వెంటనే కేసీఆర్ పై విచారణను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాజ్జి విష్ణు, కోరాపెల్లి రాజేష్, రాము, రాజేష్, అనిల్, వేణు, ప్రవీణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.