07-05-2025 12:11:09 AM
సింధూ ఒప్పందం రద్దుపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మే 6: ‘మన జలాలు మనకే. ఇన్ని రోజులు మన వాటా జలాలు కూడా బయటకు వెళ్లాయి. కానీ ఇకపై అలా జరగదు’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం రద్దు గురించి ప్రధాని మోదీ తొలిసారి బహిరంగంగా స్పందించారు.
మంగళవారం ఓ వార్తా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఈ ఆంశంపై స్పందించారు. ‘మన జలాలు మనకే. ఇన్ని రోజులు మన వాటా జలాలు కూడా బయటకు వెళ్లాయి. ఇప్పుడిక భారత జలాలు భారత్‌లోనే ప్రవహిస్తాయి. ఇండియాలోనే ఉండి.. ఇండియా ప్రయోజనాలు తీరుస్తా యి.’ 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూనదీ జలాల ఒప్పం దాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.