12-11-2025 12:00:00 AM
వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్
కైరో, నవంబర్ 11: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ షూట ర్లు సత్తా చాటుతున్నారు. వ్యక్తిగత విభాగాల్లో అదరగొట్టిన మన షూటర్లు తాజాగా టీమ్ ఈవెంట్స్‌లోనూ పతకాలు గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్, సామ్రాట్ రాణా జోడీ రజత పతకం సాధించింది .సోమవారం వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సామ్రాట్, ఇషాతో కలిసి మిక్సిడ్ టీమ్ ఈవెంట్‌లో చివరి వరకూ పోరాడినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మరో షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. మెడల్ రౌండ్‌లో ఐశ్వరీ ప్రతా ప్ సింగ్ 466.9 పాయింట్లతో రెండో స్థానం లో నిలిచాడు. అగ్రస్థానంలో నిలిచిన చైనా షూటర్‌కు , అతనికి మధ్య 0.2 మాత్రమే తేడా ఉంది. ఓవరాల్‌గా పాయింట్ల పట్టికలో భారత్ 11 పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత షూటర్లు ఇప్పటి వర కూ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు గెలిచారు. 15 పతకాలతో చైనా అగ్రస్థానం లో ఉండగా.. కొరియా 7 పతకాలతో మూడో ప్లేస్‌లో కొనసాగుతోంది.