calender_icon.png 1 October, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

01-10-2025 02:03:19 AM

మహేశ్వరం, సెప్టెంబర్ 30: స్థానిక ఎన్నికలను కందుకూరు డివిజన్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్య లు తీసుకోవాలని ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్ది పేర్కొన్నారు. మంగళవారం కందుకూరు  ఆర్డీవో కార్యాలయం సమావేశ మందిరంలో డివిజన్ పరిధి లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వచ్చిందని తెలిపారు.ఇప్పటి నుండి అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుని గ్రామాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలతో మమేకం కాలనీ ఆయన సూచించారు.

గత ఎన్నికలలో తమకు సహకారం అందించిన విధంగానే ఈఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించాలని పాలు రాజకీయ పార్టీలను, ప్రజలను  కోరారు. కందుకూరు, మహేశ్వరం, కర్తాల్ ఆమనగల్, తలకొండపల్లి తహశీల్ దారులు గోపాల్,సి.అప్పల నాయుడు,హాయిం ఖాద్రి,షేక్ ముంతాజ్, ఎంపిడిఓలు పి.రమేష్, పి.శైలజ, బి.సరిత, కుసుమ మాదురి, కే. సుజాత నాయక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.