02-12-2025 12:00:00 AM
వికారాబాద్, డిసెంబర్ -1: వికారాబాద్ పట్టణంలోని శీవాజీ నగర్ కాలనీలో గల గణేష్ కట్ట వద్ద గీతా వాహిని ఆధ్వర్యంలో ఘనంగా గీతా జయంతి వేడుకలు సోమవారం జరిగాయి. గీతా జయంతి ని పురస్కరించుకుని గీతా యజ్ఞం, సంపూర్ణ భగవద్గీతా పారాయణం నిర్వహించారు.
ఈ సందర్బంగా గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ, గత ఎనిమిది సంవత్సరాలుగా గీతా పారాయణం తోపాటు గీతా ప్రచారం చేస్తున్నామని చెప్పారు. భగవద్గీతను ఉచితంగా ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. భగవద్గీత జీవన గీతా అని, గీతా పారాయణం ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
భగవద్గీత పఠించడం వలన వ్యక్తిత్వ వికాసం మెరుగు పడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ మెతుకు ఆనంద్, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు టి. సదానంద్ రెడ్డి, బిజెపి దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పి. నవీన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, మాజీ వైస్ చైర్మన్ మాజీ రమేష్ కుమార్, కౌన్సిలర్లు రమేష్ గౌడ్, మోముల స్వాతి, పావని, అనంత లక్ష్మి, దమయంతి, ఒంగోత్ దేవీ నాయక్, రాజ్య లక్ష్మి, గీతా వాహిని సభ్యులు లావణ్య, జయశ్రీ, వరలక్ష్మి, విజయ, నీరజ, ఝాన్సీ రాణి, సునీత, లక్ష్మి, మధూరి, జోత్స్న, సరళ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.