calender_icon.png 10 May, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ భద్రత వారోత్సవాలు

07-05-2025 12:00:00 AM

గూడూరు.మే 6 :  మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో విద్యుత్ భద్రత వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గూడూరు సబ్ డివిజన్స్ స్టాప్ తో ఏడిఈ కవిత ఆధ్వర్యంలో సమావేశం జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ పెద్దిరాజ్యం అదేవిధంగా మహబూబాబాద్ డివిజన్ ఇంజనీర్ విజయ్ కుమార్ హాజరయ్యారు.

టెక్నికల్ ఇంజనీర్ మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రతపై నిర్లక్ష్య వహించరాదని తెలిపారు. ప్రజలకు విద్యుత్ భద్రతపై అవగాహన కలిగించే బాధ్యత మనపై ఉందని ఎల్సీలు తీసుకునే సమయంలో ఆత్రుత పడకూడదని అన్నారు. ఎర్త్ రాడ్ హెల్మెట్ గ్లౌస్ వాడే విధానం గుర్తు చేసి ముగించారు అనంతరం డి విజయ్ మాట్లాడుతూ సిబ్బంది తాము చేసే పనుల్లో విధిగా భద్రత సూత్రాలు పాటించాలని వినియోగదారుల ఇంట్లో వెలుగులు నింపే సిబ్బంది తమ క్షేమం గురించి కూడా గుర్తుంచుకోవాలని అన్నారు.

ప్రతిజ్ఞ తప్పనిసరిగా పాటించాలని తెలియజేస్తూ ప్రజలలో కూడా చైతన్య కనిపించాలని కోరారు సిబ్బందితో పనులలో బాధ్యత వహించాలని ఎక్కడ కూడా విద్యుత్ ప్రమాదంలో జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వినియోగదారులు నాణ్యమైన పరికరాలు వాడే విధంగా ప్రోత్సహించాలని అన్నారు అనంతరం విద్యుత్ను పొదుపుగా వాడాలని ఉద్దేశంతో పొదుపు సూత్రములు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.