calender_icon.png 22 November, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రోకు రూ.1,100 కోట్లు

26-07-2024 12:40:17 AM

అందులో పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500కోట్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,100కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో హైదరాబాద్ మెట్రో రైల్‌కు రూ.500కోట్లు, పాతబస్తీ మెట్రో రైల్ విస్తరణకు రూ.500కోట్లు, ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు రూ.100కోట్లు కేటాయించింది. పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నామా వరకు, నాగోల్, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో మార్గాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో అధికారులు సర్వే చేస్తున్నారు. భూసేకరణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే  లక్ష్యంతో మెట్రో ఫేజ్ 2లో భాగంగా రూ.24,042కోట్లతో 78.4కిలో మీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించడానికి ప్రభుత్వం యోచిస్తోంది.