calender_icon.png 22 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు

26-07-2024 12:41:33 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కు ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో నగరంతో పాటు నగర శివారులో బస్‌బేలతో పాటు పలు ప్రాంతాల్లో పార్కింగ్‌లు, పార్కులను నిర్మించనుంది. హెచ్‌ఎండీఏ విస్తరించిన 7 జిల్లాల పరిధిలో ప్రజల మౌలిక సదుపాయాలు, రవాణా తదితర అభివృద్ధి కార్యక్రమాలతో నగరాన్ని మరింత సుందరీకరించనున్నారు. నగరానికి నలు వైపుల నుంచి వచ్చే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపర్చడానికి రహదారులు, ఫ్లుఓవర్లు, కారిడార్లు హెచ్‌ఎండీఏ నిర్మించనుంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు చేపడుతుండగా, కొత్తగా ఈ ఏడాది రాజీవ్ కారిడార్‌ను ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఈ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ పనులు అధికారులు ప్రారంభించారు.