calender_icon.png 9 August, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగుల ఆందోళన

09-08-2025 12:06:26 AM

డీఎం వేధిస్తున్నాడంటూ మహిళా కండక్టర్ ఆరోపణ

మణుగూరు, ఆగస్టు 8 (విజయ క్రాంతి) : మహిళా కండక్టర్ ను మణుగూరు డిపో మేనేజర్ వేధిస్తున్నారు అంటూ ఆరోపిస్తూ శుక్రవా రం ఆర్టీసీ డిపో గేటు ఎదుట కండక్టర్లు, డ్రైవర్లు, విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.డిపో మేనేజర్ ప్రయాణికుల ఫిర్యాదును ఆధారం చేసుకుని పదేపదే మహిళ కండక్టర్లను, వేధిస్తున్నాడని, వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని లేనిచో విధులకు వెళ్లేది లేదని నిరసన తెలిపారు.

దీంతో సిఐ నాగబాబు రంగ ప్రవేశం చేసి, సమస్యను శాంతి యుతంగా పరిష్కరించు కోవాలని సూచించడంతో ఉద్యోగులు ఆందోళనను విరమించారు. ఈ విషయంపై డిఎం ను  వివరణ కోరగా ఉద్యోగుల ఆందోళన పై డీఎం శ్యాం సుందర్ స్పందించారు. ప్రయాణి కుల కోసం కొత్తగా తోగూడెం, లక్ష్మీపురం లలో బస్టాప్లు ఏర్పాటు చేశామని, గత ఆరు నెలలు గా డ్రైవర్లకు ,కండక్టర్లకు, సూచిస్తున్న విషయాన్ని పట్టించు కోవాడం లేదన్నారు.

లక్ష్మీపురం స్టేజి వద్ద గురువారం బస్సు ఆపమని ఓ ప్రయాణికుడు డ్రైవర్ ,కండక్టర్ ను కోరిన, బస్సు ఆపలేదని, ప్రయా ణికుడు ఫోన్ చేసి తనకు పిర్యాదు చేశారని, అక్కడ స్టాప్ ఉందని మహిళా కండక్టర్కు సూచించానని, తెలిపారు. దీంట్లో తన ప్రేమేయం లేదని, విషయాన్ని పక్కన దోవ పట్టిస్తూ ఆందోళనకు దిగడం సరికాదన్నారు.